అదానీ సంక్షోభంతో ..... దేశంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం

MEDIA POWER
0

 

మీడియా పవర్, ఢిల్లీ: అదానీ సంక్షోభం తర్వాత దేశంలో రాజకీయ వాతావరణం   వేడెక్కిందని  హంగేరియన్-అమెరికన్, వ్యాపారవేత్త, దాత జార్జ్ సోరోస్ అన్నారు. ఈ విషయంపై మోడీ మౌనంగా ఉన్నారని, విదేశీ పెట్టుబడిదారులు, పార్లమెంటులో అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని సోరోస్ సూటిగా ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. 

ఇది భారత సమాఖ్య  ప్రభుత్వంపై మోడీ పట్టును గణనీయంగా బలహీనపరుస్తుందని,  సంస్థాగత సంస్కరణలకు తలుపులు తెరుస్తుందని  అన్నారు.  నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మ్యూనిచ్ సెక్యూరిటీ సమావేశంలో సోరోస్ అన్నారు.

8.5 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన 92 ఏళ్ల జార్జ్ సోరోస్ ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే గ్రూపులు, వ్యక్తులకు గ్రాంట్లు ఇచ్చే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పై విధంగా వ్యాఖ్యానించడం విశేషం. 

గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని చుట్టుముట్టిన కల్లోలం స్టాక్ మార్కెట్ అమ్మకాలు  పెట్టుబడులకు విఘాతం కల్పించడమే కాకుండా భారత్ పై  ఉన్న నమ్మకాలు  సన్నగిల్లే  అవకాశం ఉందని  సోరోస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

2023 జనవరి 24న హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ జాబితాలో  వున్న కంపెనీలు దాదాపు అన్ని ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ మార్కెట్లో యథేచ్ఛగా పతనాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. అదానీ గ్రూప్ అక్రమంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టి , మార్కెట్  విలువలను తారుమారు చేసిందని ఆరోపించిన ఆయన  దీని కారణంగా  షార్ట్ సెల్లర్ నివేదికతో ఆ సంస్థ 120 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయిందని  అన్నారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">