మీడియా పవర్: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల అరాచకాలకు పోలీసులు వంత పలుకుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శించారు. గన్నవరంలో పోలీసులు చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఘటనపై నజీర్ స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వపాలనలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్ధం మారిపోయిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ నాయకులకు దాసోహమై ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. దాడులు చేసిన వారిపై కాకుండా భాదితులపైనా అన్యాయంగా కేసులు పెట్టి భాదిస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారన్నారు. పాలన గాలికొదిలి ప్రతిపక్షాలపై విద్వాంస కాండకు పాల్పడటం వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శనమని నజీర్ వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఘటనపై స్పందించిన .... నజీర్
February 20, 2023
0
Tags