కాకినాడ: రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. అందుకే తన వయసును సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. ఒక పక్క పర్యటనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంతున్నారు. మరోపక్క రాష్ట్రంలో పార్టీ ఇంచార్జ్ లపై దృష్టి సారిస్తూ ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం బాధ్యతల్ని యనమల దివ్య కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఇంఛార్జ్ గా కర్రోతు బంగార్రాజును, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి గంటి హరీశ్ మాథుర్, కో-కన్వీనర్‌గా నామన రాంబాబును ద్విసభ్య కమిటీ నియమించారు. మొన్నటి వరకు తుని బాధ్యతల్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు చూశారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ బాధ్యతల్ని రామకృష్ణుడి కుమార్తె దివ్యకు అప్పగించదాంతో నాయకులూ ఆశ్చర్యానికి లోనైనట్టు తెలుస్తోంది.