రూ.13,41,734 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు.......విశాఖలో ముగిసిన పెట్టుబడిదారుల సదస్సు.

MEDIA POWER
0

విశాఖపట్నం, మీడియా పవర్: రాష్ట్రప్రభుత్వం విశాఖలోని  ఆంధ్ర విశ్వకళా పరిషత్  ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో మొత్తం రూ.13,41,734 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 378 ఒప్పందాలు (ఎంఓయూ) చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. తొలిరోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు 92 ఎంఓయూలు, రెండోరోజు రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులకు 286 ఎంఓయూలు చేసుకున్నట్టు వెల్లడించింది. అత్యధికంగా పర్యాటక రంగంలో 117 ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. రెండురోజుల సదస్సులో ముకేశ్‌ అంబానీ, కరణ్‌ అదానీ, నవీన్‌ జిందాల్‌, అర్జున్‌ ఒబెరాయ్‌, కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, గ్రంధి మల్లికార్జునరావు, ప్రీతారెడ్డి, హరిమోహన్‌ బంగూర్‌, సతీష్‌రెడ్డి తదితర పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరు కాగా, రెండోరోజు  కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్‌ పాల్గొన్నారు. రెండోరోజు మధ్యాహ్నం 2 గంటలకే సదస్సు ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఎంపికచేసిన 14  రంగాలపై నే  రెండురోజులు చర్చాగోష్ఠులు  నిర్వహించారు. 

రెండో రోజు పెట్టుబడుల సదస్సులో రిలయన్స్‌ సంస్థ రూ.50వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నట్టు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 10వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ రూ.14.3 కోట్లతో , హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.22 కోట్లతో రెండు ఒప్పందాలు, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రూ.20 కోట్లతో రెండు ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది.

రూ.3,841 కోట్ల విలువైన 14 యూనిట్ల ప్రారంభించిన సిఎం 

సదస్సు వేదికగా రూ.3,841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి జగన్‌ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. వీటివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విశాఖ సెజ్‌, శ్రీసిటీ ప్రాంతాల్లో ఉన్న కింబర్లే క్లార్క్‌, బ్లూస్టార్‌, క్లైమాటిక్‌, లారస్‌ ల్యాబ్స్‌, హేవెల్స్‌ ఇండియా, శారదా మెటల్స్‌, అల్లోయ్స్  తదితర కంపెనీలు ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">