రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు... బెంగళూరులో ఘటన

MEDIA POWER
0

మీడియా పవర్:  బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తన తండ్రి కార్యాలయంలో  రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. తన తండ్రి, చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె.మదల్ విరూపాక్షప్ప క్రెసెంట్ రోడ్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుపడ్డాడు.  లోకాయుక్త పోలీసులకు చిక్కిన ప్రశాంత్ మదల్ ను లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే : సంజయ్ నగర్  డాలర్స్ కాలనీలోని ప్రశాంత్ నివాసానికి లోకాయుక్త పోలీసులు వెళ్లారు.  గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎప్ఐఆర్   నమోదు చేశారు. 81 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో లోకాయుక్త అధికారులు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ బీడబ్ల్యూఎస్ఎస్బీలో చీఫ్ అకౌంటెంట్.   అతను వసూలు చేస్తున్న లంచం కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ అయిన తన తండ్రి కి చెందినదిగా తెలుస్తోంది. వాస్తవంగా రూ.81 లక్షలు డిమాండ్ చేయగా, ఆ వ్యక్తి రూ.40 లక్షలు ఇచ్చాడని  లోకాయుక్త పోలీసులు తెలిపారు.


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">