మీడియా పవర్: 50 వ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జయప్రదం చేయాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి,జె వి రత్నం పిలుపునిచ్చారు. గురువారం ఎ ఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజి, సెవెంత్ డే ఎడ్వంటరిస్ట్ విద్యాసంస్థ, శివాజీ పాలెం జీవి ఎమ్ సి పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1973 నుండి ప్రతి సంత్సరం మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహిస్తారు అని తెలిపారు. . ప్రపంచంలోని అన్ని అడవి జంతువులు మరియు మొక్కలు మన జీవితాలలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. ఇవి మన ఆరోగ్యానికి చేసే సహకారాన్ని మేలును గుర్తించాలి అన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ అంతర్జాతీయ దినోత్సవం 1973లో సంతకం చేసి ప్రవేశ పెట్టిందన్నారు. అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలంపై అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం అయినందున ఈ తేదీని ఎంచుకున్నారాణి తెలియచేసారు. ఈ సంవత్సరం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ 'వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యులుకండి" అని. పిలుపునిచ్చారు.
మెడగస్కర్ కు చెందిన సోషల్ వర్క్ విద్యార్దిని కాసాండ్ర మాట్లాడుతూ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో బిలియన్ల మంది ప్రజలు, ఆహారం, శక్తి, పదార్థాలు, ఔషధం, వినోదం, ప్రేరణ, మానవ శ్రేయస్సుకు అనేక ఇతర ముఖ్యమైన అవసరాల కోసం అడవి జాతులను ఉపయోగించడం ద్వారా ప్రతిరోజూ ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. కానీ వేగవంతమైన ప్రపంచ జీవవైవిధ్య సంక్షోభం, లక్షల జాతుల మొక్కలు, జంతువులు అంతరించిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి పెను ముప్పని గుర్తించాలని హెచ్చరించారు.
ఎ ఎస్ రాజా విమెన్స్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ సాంబశివరావు మాట్లాడతూ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అనేది అనేక అందమైన, వైవిధ్యమైన అడవి జంతుజాలం , వృక్షజాలాన్ని పరిరక్షణ కోసం అవి ప్రజలకు అందించే అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి ఒక అవకాశం ఇదన్నారు. అదే సమయంలో, విస్తృతమైన ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక ప్రభావాలను కలిగి ఉన్న వన్యప్రాణుల వేట వంటి నేరాలు, మానవ తప్పిదాలు వల్ల జాతుల అంతరించి పోవడం వల్ల కలిగే నస్టాలు ప్రజలకు వివరంచేందుకు ఈ రోజు ఉపకరిస్తుందని అన్నారు.
సెవెంత్ డే ఎడ్వంటరిస్ట్ విద్యాసంస్థ ప్రతినిధి విజయానంద్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 15 జీవవైవిధ్య నష్టాన్ని ఆపడంపై దృష్టి పెడుతుంది. మీరు తెలుసుకున్న అంశాలను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి అని కోరారు.
శివాజీ పాలెం జీ వి ఎమ్ సి స్కూల్ హెచ్ఎం బి కే డి కుమారి మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు అనుకూలంగా భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ యాభై సంవత్సరాలు జరిగిందన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2023లో "వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలు" అనే థీమ్‌తో వైవిధ్యం చూపుతున్న వ్యక్తులను సత్కరిస్తుంది అన్నారు.భాగస్వామ్యాలు పెద్ద స్థాయిలో పనిచేస్తాయి లేదా కొంతమంది పిల్లలు లేదా పాఠశాలను కలిగి ఉంటాయన్నారు.
ఉపాధ్యాయిని ఉమాగాంధీ మాట్లాడుతూ వన్యప్రాణి పరిరక్షణ సమూహానికి ప్రయోజనం చేకూర్చడానికి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మరికొందరికి అంతరించిపోతున్న జాతుల గురించి అవగాహన కల్పించడానికి ఫోటోగ్రాఫ్‌లను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం. అవన్నీ సమానంగా నిర్వహించాలన్నారు.
జె వి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాద్యాయులు విద్యార్ధులు పాల్గొని మాట్లాడారు.