మీడియా పవర్: గురువారం విశాఖలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల (ఎంఎల్ సి ) అభ్యర్థిగా బరిలో ఉన్న గంటి రవికుమార్ మాట్లాడారు. ఆయన నిర్దిష్టమైన ఎజెండాతో ఎమ్ఎల్సీ ఎన్నికల బరిలో దిగినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర లో ఉపాధి లేక అనేకమంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని తాను గెలిస్తే ప్రతీ పట్టభద్రునికి ఉద్యోగావకాశం లేదా స్వయం ఉపాధి కల్పించేదిశగా కృషిచేస్తానని తెలిపారు. అర్హత గల ప్రతీ అభ్యర్ధికి సివిల్ సర్వీసెస్, గ్రూపు సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించే విధంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సహకారం అందిస్తామని తెలిపారు. గిరిజన, మత్స్యకార పట్టభద్రులకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తానన్నారు. హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో పని చేసే విధంగా పోరాడతానని చెప్పారు. అశ్లీల వెబ్ సైట్లు, బెట్టింగ్ యాప్ లు, ప్రజల ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్ లు నిరోధించేందుకు అలుపెరుగని పోరాటం చేస్తానని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే దుష్ఫలితాలు యువతకు వివరించేందుకు ప్రత్యేక అవగాహనా సదస్సులు నిర్వహించి వారిని చైతన్న్య పరుస్తానని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు, యువతకు ఉపాది కల్పించే వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తరాంద్ర పట్టభద్రుల కోటాలో ఎన్నికైన ఎమ్ఎల్సీ లు పదవిలో ఉన్నప్పటికీ పట్టభద్రులకు, ఉత్తరాంధ్రకు చేసిందేమి లేదన్నారు. ఈ నెల 3,4 తేదీల్లో విశాఖలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంతవరకు చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని రవికుమార్ డిమాండ్ చేసారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు విజ్ఞతతో అలోచించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిస్వార్ధంగా పాటుపడే విద్యాధికుడు, సామాన్యుని సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన తనను ఎన్నుకోవాలని అభ్యర్ధించారు. ఈ నెల 13 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో 13 వ స్థానంలో 1 ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని గంటి రవికుమార్ పట్టభద్రులను కోరారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రులు విజ్ఞతతో అలోచించి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరిన గంటి రవి
March 03, 2023
0
Tags