ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి....రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

MEDIA POWER
0

మీడియా పవర్, విశాఖపట్నం, మార్చి 5: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నిటిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని, వీటిని ప్రజలకు వివరించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు నియోజకవర్గం నుంచి, వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీతంరాజు సుధాకర్ విజయానికి న్యాయవాదులు కృషి చేయాలని ఆయన కోరారు. స్థానిక సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సిపి న్యాయవిభాగ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఆయన మీద ఉన్న నమ్మకంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధ వ్యక్తం చేశారని, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయు లు కుదుర్చుకున్నామని అమర్నాథ్ తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన ఈ  ఘణ విజయం పట్ల మాట్లాడలేని ప్రతిపక్షాలు, ఏ రకమైన విమర్శ చేయాలి అన్న ఆలోచనలో పడి కుడిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేసారు.  సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టారన్న ప్రతిపక్షాలు విమర్శలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యావేత్తలమైన మనపై ఉందని న్యాయవాదులకు ఆయన పిలుపునిచ్చారు.  గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వలేనన్ని  సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు కాబట్టే, ఆయన గురించి రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నారని అమర్నాథ్ తెలిపారు.  ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. మరో 15, 20 సంవత్సరాల తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తొలగించలేదని అమర్నాథ్ కుండబద్దలు కొట్టి చెప్పారు.   రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు వంటివి ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రముఖుల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఇటీవల యూకే నుంచి వచ్చిన కౌన్సిల్ జనరల్ మన రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటిస్తూ రైతు భరోసా కేంద్రం చూసారని, సుమారు మూడు గంటల పాటు అందులో కూర్చుని కేంద్రం గురించి తెలుసుకున్నారని అమర్నాథ్ వివరించారు. న్యాయవాదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలని సీతంరాజు సుధాకర్ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని మంత్రి అమర్నాథ్ కోరారు. రాజ్యాంగం పట్ల పూర్తీ స్థాయిలో అవగాహనా వున్నా మన న్యాయవాదులు  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">