ఎం ఎల్ సి ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు -సహాయ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి

MEDIA POWER
0
మీడియా పవర్, విశాఖపట్నం, మార్చి 5: ఎం ఎల్ సి ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సహాయ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆదివారం స్వర్ణ భారతి స్టేడియం లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లు, పోలింగ్ తరువాత మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్ర పరచడం, కౌంటింగ్ ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేశారు. అదే విధంగా కౌంటింగ్ సమయంలో ఎన్నికల పరిశీలకులకు, పోటీ లో పాల్గొన్న అభ్యర్థులకు, ఏజెంట్లకు, ఏర్పాటు చేయవలసిన సదుపాయాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిసి కెమెరాల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి పంపిణీ మరియు కౌంటింగ్ సమయంలో సమాచారం ఏవిధంగా అందించాలి అనే విషయం పై అధికారుల తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లు హుస్సేన్ సాహెబ్, బాస్కర్ రెడ్డి, సింహాచలం స్పెషల్ డిప్యూటి కలెక్టర్ రామలక్ష్మి, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్, సూపరింటెండెంట్ రామారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">