మీడియా పవర్ : జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు, ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ ఇళ్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు బుల్ డోజర్ చర్యలు చేపట్టారు. ముక్తార్ అన్సారీ కుమారులు అబ్బాస్ అన్సారీ, ఉమర్ అన్సారీ పేర్లతో యూపీ లో పలుచోట్ల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. అబ్బాస్, ఉమర్ అన్సారీలు రెండంతస్తుల ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతి పొందలేదని, దాని ప్లాన్ ఆమోదం పొందలేదని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.