మీడియా పవర్, విశాఖపట్నం: విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు దిశ సి.ఐ జి.నిర్మల మరియు సైబర్ క్రైమ్ సిఐ కె. భవానీ ప్రసాద్ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ లో పని చేస్తున్న ఉద్యోగస్తులకు, మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల, దిశ ఎస్ఓఎస్ యాప్ ప్రాముఖ్యత మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దిశ సిఐ జి.నిర్మల మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలపై జరుగుతున్న ఈవ్ టీసింగ్, మహిళల అక్రమ రవాణా మహిళల భద్రత మరియు లైంగిక వేధింపుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ దిశ ఎస్ఓఎస్ యాప్ ప్రాముఖ్యతను సవివరంగా తెలిపారు.
సైబర్ క్రైమ్ సిఐ కె.భవానీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు గురించి వివరించి, ఇంటర్నెట్ ఆధారంగా జరుగుతున్న నేరాలపై, ఆన్లైన్ షాపింగ్ పేరిట జరుగుతున్న మోసాలు, పాస్ వర్డ్ సెక్యూరిటీ టిప్స్ మరియు ఫేక్ లోన్ యాప్స్ పట్ల అవగాహన కల్పించి తక్షణమే వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఎటువంటి సైబర్ ఫిర్యాదులకైనా వెంటనే 1930కి కాల్ చేయాలని తెలియజేశారు.