“భాష్యం” ఎన్ఏ డి శాఖ విద్యార్థుల విజయదుందుభి !

MEDIA POWER
0
మీడియా పవర్, విశాఖపట్నం: మే 6వ తేదీన విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో “భాష్యం” ఎన్ఏ డి శాఖ విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు. మార్కుల సునామీ సృష్టించారు. “భాష్యం” పాఠశాల నుంచి మొత్తం 301 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. కాగా విడుదలైన ఫలితాలలో “భాష్యం” ఎన్ ఏ డి శాఖ విద్యార్థి సరిపాక సాయి సందీప్ 593 మార్కులు సాధించాడని ప్రిన్సిపాల్ కె. మణికంఠరెడ్డి మీడియా పవర్ కు తెలిపారు. 550కు పైగా మార్కులను సాధించిన విద్యార్థులు 56 మంది కాగా, 500కు పైగా మార్కులను సాధించిన విద్యార్థులు 119 మంది వున్నారని తెలిపారు. గణితంలో 100/ 100 మార్కులను సాధించిన విద్యార్థులు 17 మంది, 90 మార్కులను సాధించిన విద్యార్థులు 110 మంది సైన్స్ నందు 100/100 మార్కులను సాధించిన విద్యార్థులు ఇద్దరు, 90 మార్కులను సాధించిన విద్యార్థులు 82 మంది కావడం విశేషం. ఇది “భాష్యం” ఎన్ ఏ డి శాఖ ఘణ విజయంగా భావిస్తున్నామని ప్రిన్సిపాల్ కె. మణికంఠరెడ్డి తెలిపారు.
    విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక బృందాన్ని, విజయ దుందుభి మ్రోగించిన విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్ భాష్యం రామకృష్ణ అభినందనలు తెలిపారు. విజయానికి కారణాలైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి పాఠశాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు డైరెక్టర్ భాష్యం రామకృష్ణకు విశాఖ భాష్యం విద్యాసంస్థల సి.ఇ.ఓ.యం. సత్యం, శాఖ సహాయకులు కె .వెంకట్ లకు “భాష్యం” ఎన్ ఏడి శాఖ ప్రిన్సిపాల్ కె. మణికంఠరెడ్డి అభినందనలు తెలియజేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">