భారత జాలర్లను రక్షించిన కోస్ట్ గార్డ్

MEDIA POWER
0


మీడియా పవర్, విశాఖపట్నం: మాల్దీవుల జలాల నుంచి రక్షించిన 10 మంది భారతీయ జాలర్లను భారత కోస్ట్ గార్డ్ మే 6న విశాఖకు సురక్షితంగా తీసుకువచ్చింది. ఈ మత్స్యకారులు ఏప్రిల్ 16న  కన్యాకుమారి సమీపంలోని తెంగపట్నం నుంచి సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారి బోటు ఇంజిన్ పనిచేయకపోవడంతో గల్లంతయ్యారు. 05 రోజుల పాటు ఎలాంటి సహాయం లేకుండా వున్న మత్స్యకారులను గుర్తించిన   ఎంవీ ఫ్యూరియస్  ఏప్రిల్ 26న వీరిని రక్షించింది. కోస్ట్ గార్డ్ మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (ఎంఆర్సీసీ)కు అందిన సమాచారం మేరకు ఐసీజీఎస్ విగ్రహానుఅండమాన్ అండ్ నికోబార్  దీవుల్లోని క్యాంప్ బెల్ బే వద్ద ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక  రక్షించిన మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చారు.     

    పది మంది మత్స్యకారుల్లో 08 మంది కేరళ లోని విజింజం రాష్ట్రానికి చెందినవారు కాగా, ఇద్దరు  తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి కి  చెందినవారు గా గుర్తించారు.  కోస్ట్ గార్డ్ నౌక రక్షించిన పది మంది మత్స్యకారులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించగా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">