విద్యోదయా విద్యార్థుల ప్రతిభతో ...శతశాతం ఉత్తీర్ణత ... దధీచి భగీరథ్ కుమార్
personMEDIA POWER
May 07, 2023
0
share
మీడియా పవర్, నీలమ్మ వేపచెట్టు : మే 6న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశాఖలోని ప్రియాంకాస్ విద్యోదయా ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయపథంలో నిలిచారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదివిన కె.మౌనిష 592 మార్కులతో ప్రధమస్థానంలో నిలవగా, టీ హర్షిత సాయి 583 మార్కులు, కార్తికేయన్ 581 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యాసంవత్సరంలోను శతశాతం ఉత్తీర్ణత సాదించారని పాఠశాల కరస్పాండెంట్ దధీచి భగీరథ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. తమ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన అత్యుత్తమ శిక్షణ , విద్యార్థులు అత్యంత పట్టుదలతో, శ్రద్ధాభక్తులతో చదవడం వల్లనే శతశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి భగీరథ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఉతీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతఙ్ఞతలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.