విశాఖపట్నం: ఆంధ్రా విశ్వకళా పరిషత్ ఆవిష్కరణల్లో ఒకటైన 'మెటాలిటీ ఫ్రీ హైడ్రోజన్ సెన్సార్ అండ్ మెథడ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్' కు భారత ప్రభుత్వ పేటెంట్స్ కంట్రోలర్ 11 నెలల రికార్డు కాల వ్యవధి లో పేటెంట్ మంజూరు చేసింది. ఏయూ సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హెడ్ ప్రొఫెసర్ హనుమంతు పురుషోత్తం మాట్లాడుతూ సాధారణ కాలపరిమితి నాలుగైదేళ్లు కాగా రికార్డు స్థాయిలో 11 నెలల్లో పేటెంట్ లభించడం ఏయూ ఇక్కడ జరుగుతున్న నాణ్యమైన పరిశోధనలకు బలమైన నిదర్శనమని తెలిపారు. లోహ రహిత హైడ్రోజన్ సెన్సార్ వృద్ధికి సిద్ధంగా ఉందని హైడ్రోకార్బన్ మరియు ఇతర ప్రాసెసింగ్ పరిశ్రమలలో దాని అనువర్తనాలను కనుగొంటుందని అన్నారు. కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె.సురేష్ బాబు, ప్రొఫెసర్ కె.బసవయ్య ఈ పరిశోధనకు నేతృత్వం వహించారని ప్రొఫెసర్ పురుషోత్తం తెలిపారు. ఈ ప్రాజెక్టులో తోకల నాని, వల్లె కృష్ణ వేణి పాలుపంచుకున్న ఇతర పరిశోధక విద్యార్థులు అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ మరియు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చాయని, పేటెంట్ ఫైలింగ్ మరియు ప్రాసిక్యూషన్ విశాఖపట్నంలోని నోవల్ పేటెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేసింది.
హైడ్రోజన్ సెన్సార్ కు పేటెంట్ పొందిన "ఆంధ్ర విశ్వకళా పరిషత్"
May 12, 2023
0
Tags