మీడియా పవర్, గాజువాక: భాజపా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాత గాజువాక కూడలిలో నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చార్జిషీట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి ఫిర్యాదులు అందుకున్న నేతలు వాటిని 15వ తేదీన ఆయా ప్రాంతాల పోలీసు స్టేషన్ లలో అందచేస్తామని నరసింగరావు తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు,దీర్ఘకాలిక సమస్యలపై భాజపా పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత అధికారపార్టీ అరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని, గట్టిగా అడిగితే తిరిగి కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గూటూరు శంకరరావు, బాటా శ్రీనివాస్, రోహిణి, బోండా ఎల్లాజీరావు, జీలకర్ర భువనేశ్వరి, గీతా సింగ్, నాగేశ్వరరావు , తాతారావు, గరికిన పైడిరాజు, జిలకర్ర రమణ,పేర్ల అప్పారావు ,రంజిత్ ,రాజశేఖర్ ,రామస్వామి తదితరులు పై కార్యక్రంలో పాల్గొన్నారు.
భాజపా ప్రజా చార్జిషీట్ కార్యక్రమానికి విశేష స్పందన... గాజువాకలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
May 11, 2023
0
Tags