మీడియా పవర్, విశాఖపట్నం: అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై పవన్ కుమార్ సమర్పణ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన కస్టడీ చిత్రం ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం విశాఖలోని నోవాటేల్ హోటల్ లో మీడియా సమావేశం ఏర్పటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు నాగ చైతన్య చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాతో కలిసి సంగీతం అందించడం విశేషం . వైజాగ్ లో తీసిన తన ప్రతి సినిమా హిట్ అవుతుందని ఆయన ఎంతో నమ్మకంగా చెప్పారు. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని సినిమా చాలా బాగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్ , ప్రియ మణి వంటి అత్యున్నత స్థాయి నటులు ఇందులో నటించారని తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఆశక్తి రేపే సన్నివేశాలు వుంటాయ న్నారు. నిర్మాతలు శ్రీనివాస్, పవన్ కుమార్ అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతొ సినిమా తీశారని వారికీ ధన్య వాదాలు తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, కస్టడీ సినిమాను శివ సినిమాతో పోల్చవద్దని కోరారు. దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథ మొదటి సిటింగ్ లోనే బాగా నచ్చిందన్నారు. సినిమా మొదలైన 40 నిమిషాల తరువాత నెక్స్ట్ లెవెల్ లో వుంటుందని, కిశోర్ తదితరులు కావల్సినంత వినోదం అందిస్తారు అని తెలిపారు. కంటెంట్ వుంటే పాన్ ఇండియా సినిమా అవుతుంది అన్నారు. హీరోగా అన్ని జోనర్ సినిమాలు చేస్తాను అన్నారు. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది అన్నారు.
Post a Comment
0Comments
3/related/default