మీడియా పవర్, విశాఖపట్టణం, మే, 6: మే 6వ తేదీ విడుదలైన 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. మల్లిఖార్జున అభినందించారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత పొంది రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లా 5వ స్థానం లో నిలిచిందని, ఈ విద్యా సంవత్సరములో 3 వ స్థానంలో నిలిచినదని తెలియపరుచుటకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొదటి 3 స్థానాలలో ఉత్తీర్ణత శాతంలో గతం కన్నా మెరుగైన లక్ష్యం పెట్టుకోవటంతో పాటు గత విద్యార్థుల కన్నా మెరుగైన ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాను 3 వ స్థానంలో నిలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన జిల్లా విద్యా శాఖ అధికారి, ఉప విద్యా శాఖ అధికారి, అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త, జిల్లా పరీక్షల విభాగం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముఖ్యంగా ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. అదే విధంగా అత్యదిక మార్కులు సాధించిన కస్తురిభా విద్యార్థినులను కూడా అభినందించారు. ఉత్తీర్ణత పొందని విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా జూన్ 2వ తేదీ నుండి జరగబోయే సప్లమెంటరీ పరీక్షలకు హాజరై అధిక మార్కులతో ఉత్తీర్ణత సాదించాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో చదవాలన్నారు. ఇందుకోసం ఈ నెల 8వ తేది నుండి జిల్లాలోని అన్ని పాఠశాలలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ఉత్తీర్ణతకు కృషి చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఉత్తీర్ణత పొందిన విద్యార్థులను అభినదించిన.. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లిఖార్జున
May 06, 2023
0
Tags