మీడియా పవర్, విశాఖపట్నం: ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే బ్యాంకు ప్రధాన లక్ష్యమని యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం జనరల్ మేనేజర్ సుదర్శన్ భట్ తెలిపారు. శుక్రవారం యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు నిర్వహించిన మెగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సుదర్శన్ భట్ బ్యాంకు ఖాతాదారులకు 65 కోట్ల రూపాయల రుణ మంజూరు పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బ్యాంక్ పురోగతికి ఖాతాదారుల నమ్మకమే పునాది అని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించి బ్యాంక్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ సకాలంలో రుణాలను చెల్లించి బ్యాంకు ఉన్నతికి సహకరించాలని ఖాతాదారులను సుదర్శన్ భట్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఖాతాదారులు బ్యాంకు జనరల్ మేనేజర్ సీవీఎన్ భాస్కరరావు, డిప్యూటీ జోనల్ హెడ్ సంతోష్ ప్రభు,రీజినల్ హెడ్ కే డుండీశ్వరరావు, డిప్యూటీ రీజినల్ హెడ్ నరేష్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
Post a Comment
0Comments
3/related/default