త్యాగానికి ప్రతీక బక్రీద్... సభాపతి తమ్మినేని సీతారాం

MEDIA POWER
0


ఆమదాలవలస, జూన్ 29 : త్యాగానికి ప్రతీకగా ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ నిలుస్తుందని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రతి మనిషి సేవానిరతి, క్షమాగుణం అలవర్చుకోవాలన్నది ఈ పండుగ సారాంశమని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా నియోజకవర్గం, జిల్లా, తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ అల్లా దయతో, ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">