మాడుగుల, జూన్, 29: మండలంలోని వంటర్లపాలెం గ్రామంలో విశాఖ డైరీ సహకారంతో ₹4.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాల ఉత్పత్తిదారుల భవనాన్ని మంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చిన్న సంస్థగా మొదలైన విశాఖ డైరీ ప్రస్థానం నేడు అత్యున్నత స్థాయికి చేరుకుందంటే దానికి కారణం స్వర్గీయ అడారి తులసి రావు కృషి, పాడి రైతుల పట్ల వారికున్న ప్రేమ నిబద్ధత, అని తెలిపారు. ఉత్తరాంధ్ర పాడి రైతులకు ఆయన సేవలు చిరస్మరణీయమని, విశాఖ డైరీ ద్వారా ఎన్నో మౌలిక సదుపాయాలు ప్రజలకు అందిస్తూ వస్తున్న సంస్థ అని మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో విశాఖ డెయిరీ సంస్థ తలపెట్టిన ఏ సేవ కార్యక్రమానికైనా తండ్రి తులసి రావు గారి పేరుమీద పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో శీరంరెడ్డి సూర్యనారాయణ, పాల సంఘం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
పాల ఉత్పత్తిదారుల నూతన భవనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు
June 29, 2023
0
Tags