ఆమదాలవలస, పొందూరు, జూన్ 29 : నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రజల సమస్యను ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన హామీలను 98 శాతం నెరవేర్చారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం కొంచాడ మరియు చిన్న కొంచాడ గ్రామలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందిన పథకాలను తెలుసుకుంటూ, అందని వాటిపై అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సుమారు 81 లక్షల నిధులతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి కొళాయి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లొలుగు కాంతారావు, పీఏసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణ మూర్తి, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, గాడు నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడన సునీల్, వైస్ ఎంపీపీ వండాన వెంకటరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిళ్ళన సూర్యారావు, స్థానిక సర్పంచ్ పి. అనురాధ, స్థానిక నాయకులు పి.తవిటినాయుడు, రామినాయుడు, ఢిల్లీ బాబురావు మరియు వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.