అపోలో హాస్పిటల్ విశాఖలో అరుదైన శస్త్రచికిత్స

MEDIA POWER
0

ట్రాన్స్ కెథటర్ మైట్రల్ వాల్వ్ మార్పిడి చేసిన కార్డియాలజీ డాక్టర్ల బృందం

అపోలో హాస్పిటల్ విశాఖపట్నం కార్డియాలజీ డాక్టర్ల బృందం నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స సత్ఫలితాన్నిచ్చింది. ఓపెన్ హార్ట్ మరియు ఎడమ కవాటం మార్పిడి జరిగి వివిధ అవయవాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ట్రాన్స్ కెథటర్ మైట్రల్ వాల్వ్ మార్పిడి  ప్రక్రియ చేసి నూతన జీవితాన్ని ప్రసాదించారు అపోలో హాస్పిటల్ విశాఖపట్నం కార్డియాలజీ డాక్టర్ల బృందం.

వివరాలలోకి వెళితే: 

78సంవత్సరాల వయసున్న శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన భానూజీ రావు అనే వ్యక్తికి, 2015 లో ఓపెన్ హార్ట్ మరియు ఎడమ కవాటం మార్పిడి చికిత్స జరిగింది. ఎడమ కవాటం మూసుకు పోవటం వలన, హృదయంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగి, ఊపిరితిత్తుల్లో మరియు శరీర అవయవాలలో  నీరు చేరటం వలన, గత 9 నెలలు గా ఆయన పలుమార్లు ఆసుపత్రి లో చేరటం జరిగిందని తెలిపారు.  దానివలన ఊపిరి తీసుకోవడానీకె కాకుండా  రోజువారి పనులు కొనసాగించుటకు తీవ్ర ఇబ్బంది పడేవారని తెలిపారు.  గుండె స్కానింగ్ లో ఎడమ కవాటం మార్పిడి అవసరం అని నిర్ధారణ జరిగిందని తెలిపారు.  పేషెంట్ కు వివిధ అవయవాలు (కాలేయము మరియు మూత్రపిండాలు) ఇబ్బందికి లోనైనట్టు గుర్తించామని తెలిపారు.  ఈ పరిస్థితులలో  మరల ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సకు  ఇతను అర్హుడు కాదు అని నిర్ధారించడం జరిగిందన్నారు. ఆయనకు పునర్జన్మని అందించేందుకు ఈ ట్రాన్స్కెథటర్ ట్రాన్స్ కెథటర్ మైట్రల్ వాల్వ్ రిప్లేసీమెంట్ ప్రక్రియ గురించి బంధువులతో చర్చింటం జరిగిందని తెలిపారు. మొదట మందులు మరియు ఇంజక్షన్లతో ఇతనికి వైద్యం చేయటం జరిగిందన్నారు. ఇతర అవయవాలకు సంబంధించిన వైద్య బృందం సూచనలను తీసుకున్న తరువాత ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని తెలిపారు. చికిత్స ముందు రోజు, పేషెంట్ యొక్క పరిస్థితి అత్యంత దిగజారిందని  అందుచే రక్తకణాల మార్పిడి చేసి, కృత్రిమంగా శ్వాస ఇచ్చి ప్రక్రియకు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రక్రియను కుడి తొడ భాగం నుంచి చిన్న రంధ్రం చేసి తద్వారా గుండె యొక్క కుడి కవాటం నుంచి ఎడమ కవాటంకి రంధ్రంచేసి 27.5 మి.మి పరిమాణం కలిగిన మైవాల్ తొ కవాటం మార్పిడి చేయటం జరిగినట్టు వివరించారు. ఈ ప్రక్రియ తరువాత రోగి వారం వ్యవధిలోనే  పూర్తిగా కొలుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతంగా జరగడంతో రోగి సంతోషంగా  ఇంటికి వెళ్లారని తెలిపారు. ఇటువంటి అరుదైన మరియు క్లిష్టమైన విధానాలు అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం వంటి పెద్ద కేంద్రాలలో  నిపుణులైన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులు మాత్రమే చేయగలరన్నారు. ఈ సర్జరీని నిర్వహించిన అపోలో కార్డియాలజీ డాక్టర్ల బృందంలోని డా. చక్రధర్ పెడాడ. డా.డి.కె. బారువా, డా.ఎన్.కె. పాణిగ్రాహి, డా.శశాంక్, మరియు డా.రవికాంత్  కార్డియాక్ సర్జన్ డాక్టర్ జైదీప్ కుమార్ త్రివేది మరియు కార్డియాక్ అనస్థీషియా బృందం ఈ ప్రక్రియను నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్స్ బృందాన్ని మరియు వైద్య సేవలను అందించిన సిబ్బందిని  అపోలో యాజమాన్యం అభినందించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">