కర్షక దేవోభవ అన్నప్రదాత సుఖీభవ ...ఆడారి కిషోర్ కుమార్

MEDIA POWER
0




పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు.

రైతే దేశానికి వెన్నెముక .

ప్రతీ పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలి.

సమాజంలో విఐపి ల కంటే రైతుకి తగిన ప్రాధాన్యత కల్పించాలి.

రైతు దేవో భవ అని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.

మీడియా పవర్, విశాఖపట్నం 29 జూలై 2023 : ఆధునిక సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ ఆహారాన్ని మాత్రం సాంకేతికంగా సృష్టించలేరని కర్షకమిత్ర, యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని పండించేది రైతులు మాత్రమే అని తెలిపారు. రైతు లేకుంటే జీవకోటికి ఆహారాన్ని అందించే నాధుడు ఎవరని ప్రశ్నించారు? రైతులు నేడు ఎంతో దుర్భర స్థితిలో బ్రతుకు తున్నారని, మానవాళి మనుగడకు కృషిచేస్తున్న వారిని ప్రభుత్వాలు ఆదుకోవని కోరారు. రైతులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం కర్షక దేవోభవ అన్నప్రదాత సుఖీభవ పేరుతో పూసపాటి రేగ మండల పరిధిలో ఏరుకొండ అనే గ్రామంలో చుట్టుపక్కల రైతులు అందరికీ రైతాంగం పై సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అక్షరాబ్యాసం చేసిన నాటినుంచి విద్యార్థులకు నేర్పించే నీతి వాక్యాలైన మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అతిధి దేవోభవ అనే కాకుండా కర్షక దేవోభవ అని నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉందని కిషోర్ అన్నారు. మానవాళి కడుపు నింపడం కోసం నిత్య కృషిలోలుడుగా ప్రకృతి ఒడిలో పని చేస్తున్న రైతుకు ప్రకృతి వైపరీత్యాలతో కన్నీరే మిగులుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామగ్రామాల నుంచి ఖండాంతరాల వరకూ సర్వ మానవాళి ఆకలి తీరుస్తూ నడిపిస్తున్నది కేవలం రైతు మాత్రమేనని ప్రతీ ఒక్కరూ అంగీకరించాల్సిందేనన్నారు.
దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అన్న గాంధీ మహాత్ముని మాటలను గౌరవిస్తూ, రైతే దేశానికి వెన్నెముక అని అందరూ నినదించాలని ఆడారి కిషోర్ పిలుపునిచ్చారు. మన ప్రాంతాల్లోని రైతులకు అన్ని విషయాలలో ప్రజా సహకారం అందించేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి కార్యాచరణ చేసినట్టు తెలిపిన ఆయన రైతుల గౌరవం పెంచే విధంగా ఫ్లెక్సీలు, విగ్రహాలు, ఫోటోలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సమావేశంలో సహాయక వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి సంఘ శ్రీవిద్య ఆషిత, సోషల్ వర్కర్ గుమ్మడి ప్రశాంతి, రచయిత ఉపాధ్యాయురాలు డాక్టర్ మురహరరావు ఉమాగాంధీ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">