సాయి హిల్ స్లోప్ పార్క్ లో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

MEDIA POWER
0
     సాయి హిల్ స్లోప్ పార్క్ లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న  కమిటీ సభ్యులు 

    విశాఖపట్నం : సీతమ్మధార లోని సాయి హిల్ స్లోప్ పార్క్ లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పార్క్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. కమిటీ అధ్యక్షులు ప్రొఫిసర్ ఎస్ ఆర్ కె రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారు. నేటి సమాజంలో పెరిగిపోతున్న లంచాల సంస్కృతి పై మాట్లాడుతూ, లంచం అడగడం ఎంత నేరమో, లంచం ఇవ్వడం అంతే నేరంగా పరిగణించాలని తెలిపారు. ప్రజలందరూ అవినీతి రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్క పౌరుడు నడుంబిగించాలని పిలుపు నిచ్చారు. అనంతరం  శ్రీమతి శ్యామలా దీపిక గారు ప్రసంగిస్తూ రావు గారు చెప్పినది అక్షర సత్యమని అవినీతి నిర్ములన మనచేతుల్లోనే ఉందని దానిని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు ప్రతిన పునాలని అన్నారు. 

    పార్క్ కమిటీ  సభ్యులు ఆజాద్ కా అమృత్  మహోత్సవాన్నీ పురస్కరించుకొని 75 సం||ల వయస్సు పై బడిన వారిని ఘనంగా సన్మానించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు మరియు వాలంటీర్ గా సేవలు అందిస్తున్న వారికి శ్రీమతి సంధ్యారాణి బహుమతులను అందజేసారు. గ్రీన్ క్లైమేట్ రత్నం  మరియు శ్రీమతి ప్రశాంతి  (వనదేవత) పలురకాల మొక్కలను విరాళంగా అందించారు. దాదాపు 60 మంది కమిటీ కుటుంబ  సభ్యులు, మిత్రులు  ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. పలువురు సభ్యులు జాతీయ గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. శ్రీ నిష్ఠల రాజు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో  కమిటీ సెక్రటరీ డి.రామచంద్ర రావు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">