విశాఖపట్టణం: సంస్కృత భారతి విశాఖ శాఖ ఆధ్వర్యంలో సముద్రతీరంలో శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్కృతభాష ప్రచారంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృత భారతి ఉచితంగా నిర్వహించే పది రోజులలో సంస్కృత సంభాషణ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. సంస్కృత భాషాభివృద్ధికి ఈ సంస్థ శిబిరాలు, బాలసంస్కార కేంద్రాలు, సంస్కృత పరీక్షలకు ఉచిత శిక్షణ నిర్వహిస్తోంది. ప్రజలకు అవగాహన కలిగించడానికి నిర్వహించిన శోభాయాత్ర లో అరవై మందికి పైనే కార్యకర్తలు పాల్గొన్నారు. శోభాయాత్ర లో నిర్వహించిన సంస్కృత గీతాలాపన, వీధి నాటకములు, చిన్నారుల సంస్కృత సంభాషణలు బీచ్ రోడ్లో వెళ్తున్న ఎంతో మందికి ప్రేరణగా నిలవడమే కాకుండా సంస్కృతం పట్ల అవగాహన కలిగించాయని ప్రాంతకార్యదర్శి శ్రీ రాంకుమార్గారు, జనపద అధ్యక్షులు డా. సుందరరాజ పెరుమాళ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతకార్యదర్శి శ్రీ రాంకుమార్గారు, జనపద అధ్యక్షులు డా. సుందరరాజ పెరుమాళ్, జనపద కార్యదర్శి డా. మల్లాది శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి, తదితర శిక్షకులు మరియు సంస్కృతభారతి సభ్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే రోజులలో సంస్కృతభారతి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ కావాలని, సంస్కృత భాషకు గతవైభవం తేవాలని శ్రీ రాంకుమార్ గారు పిలుపునిచ్చారు. నగర ప్రజలనుండి మంచి స్పందన లభించడమే కాకుండా సంస్కృత భాష నేర్చుకునేందుకు అనేక నగర ప్రజలు ఆసక్తి చూపించడం పట్ల సంస్కృత భారతి విశాఖ శాఖ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.
సంస్కృత భారతి ఆధ్వర్యంలో శోభాయాత్ర
August 07, 2023
1
సంస్కృతం నేర్చుకుందాం ...సంస్కృతిని కాపాడుకుందాం
Tags