" రానున్న ఎన్నికలతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేతపవన్ కల్యాణ్ అన్నారు. తాను పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సీఎంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని తెలిపారు."
దోపిడీకి వ్యతిరేకంగానే మానుకోటలో జగన్‌పై రాళ్లదాడి
‘‘రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తున్నాయని అన్నారు. విశాఖలో పెద్దఎత్తున భూ దోపిడీ జరుగుతోందని, లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని ఆరోపించారు. విశాఖలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి కడప సిమెంట్ కర్మాగారానికి తరలిస్తున్నారని తెలిపారు. ఖనిజాల తవ్వకాలతో పర్యావరణం తీవ్ర స్థాయిలో విధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఉత్తరాంధ్రను దోచేందుకే విశాఖ రాజధాని అంటూ ముఖ్యమంత్రి హడావుడి చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో 30 వేల ఎకరాలకుపైగా భూములు జగన్ అండ్ కో గుప్పిట్లో ఉన్నాయని తెలిపారు. దోచేసిన భూముల విలువ పెంచేందుకే రాజధాని జపం చేస్తున్నారాణి అన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలోనూ విచ్చలవిడి దోపిడీ జరిగిందని అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగానే మానుకోటలో జగన్‌పై రాళ్లదాడి జరిగిందని అన్నారు.
ఈ ప్రభుత్వాన్ని చూసిన తరువాత తెదేపా పాలనే నయమనిపించింది.
సీఎం జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని జగన్.. రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని అన్నారు. బ్రిటీష్ హయాంలో కంటే తీవ్రంగా విభజించి పాలిస్తున్నారని అన్నారు. యువతులు అదృశ్యమైతే సీఎం స్పందించపోవడం విడ్డురంగా ఉందని అన్నారు. అన్నీ బేరీజు వేసి చూస్తే తెదేపా పాలనే నయమనిపిస్తోందని కితాబిచ్చారు. వైకాపా ప్రభుత్వాం చేస్తున్న అక్రమాలను వెలికి తీసి గద్దెదించుతామని తెలిపారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తుందని తెలిపారు. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానాని సీఎంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని ’’ పవన్ వెల్లడించారు.