సమస్యల వలయంలో దివ్యాంగులు... మానవత్వం పరిమళించిన నాయకునికి విన్నపాలు .

MEDIA POWER
0

పైదృశ్యాలు మానవత్వం వున్న ప్రతి ఒక్కరిని కలచివేయక మానవు.  ఇది  రాజకీయ క్రీడకాదని, మానవత్వం వున్న నాయకులకు ప్రచారం చేయాలన్నదే మా ఆదర్శం అని తెలిపేందుకే ఇన్ని ఫోటోలు పెట్టడం జరిగిందని మా పాఠకులకు విన్నవిస్తున్నాము .

విశాఖపట్నం:- జనసేన  నిన్న  నిర్వహించిన జనవాణి "భరోసా" కార్యక్రమంలో అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని  తమ సమస్యలు పవన్ కళ్యాణ్ కి విన్నవించుకున్నారు.  సుమారు 30 మంది దివ్యాంగులు జనవాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారని తెలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్  వారి వద్దకు వెళ్లి పేరు పేరు అడిగి తెలుసుకొని పలుకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నుండి ఎం.సురేష్ పలు అంశాలపై భరోసా కల్పించిన నాయకునికి వివరించారు.  3 వేల రూపాయల  పించన్ మినహా వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి సంక్షేమం కల్పించడం లేదని తెలిపి  వాపోయారు. 2016 దివ్యాంగుల చట్టంపై అధ్యయనం చేసి అమలుకు కృషి చేయాలని కోరారు. దివ్యాంగురాలైన అనాథ చిన్నారిని పెంచుకుంటున్న శ్రీమతి సూర్యకాంతం అనే వృద్ధురాలు తానుపెంచుకుంటున్న చిన్నారికి పెన్షన్ ఇప్పించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్ లో 11 సంవత్సరాలుగా పని చేస్తున్న తమను తొలగిస్తున్నట్టు ఉన్న ఫళంగా నోటీసులు ఇచ్చారని దివ్యాంగులు జి. నాగమణి. ఎన్. వెంకటలక్ష్మిలు  పవన్ జనసేనానికి  వివరించారు.  జీతం పెంచకపోగా వైసీపీ ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని కంటతడి పెట్టారు.  అనంతరం రాదా  ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలైన దివ్యాంగులను పవన్ కళ్యాణ్  కలిశారు. మానసిక, అంగ వైకల్యంతో బాధపడుతున్న ఆ చిన్నారులను చూసిన  పవన్ కొంత సమయం నిచ్చేష్టులై  ఉండిపోయారు. అనంతరం మానవత్వానికి ప్రతీకగా నిలిచినా అయన వారితో కొంత సమయం గడిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓ చిన్నారి తమిళంలో అయ్యప్ప పాటలు పాడుతుందని తెలిసి తమిళంలో సంభాషించి పాట పాడమని అడిగారు. వైకల్యం ఉన్న చిన్నారులకు సైతం ఫించన్ ఇవ్వడం లేదని, అనాధలకు రేషన్ కార్డులు ఎక్కడి నుంచి తెస్తామని ఫౌండేషన్ సభ్యులు వారికీ భరోసా కల్పించిన నాయకుని ముందు వాపోయారు. దివ్యాంగులపట్ల మానవతా దృక్పదంతో సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించేలా చూడాలని  కోరారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">