భాష్యం హైస్కూల్ ఎన్ఏడి శాఖలో అంగరంగ వైభవంగా "తెలుగు భాషా దినోత్సవ " వేడుకలు

MEDIA POWER
0


 
మీడియా పవర్, విశాఖపట్నం: భాష్యం హైస్కూల్ ఎన్ఏడి శాఖలో   ప్రముఖ సాహితీవేత్త, వ్యవహారిక సత్తావాది అయిన గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని   తెలుగు భాషా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా  నిర్వహించారు.  

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సాహితీవేత్త గుండాన జోగారావు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. చిన సూర్యనారాయణ, తెలుగు భాష ప్రాచూర్యంకోసం తన వంతు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త, సమాజహిత పత్రికా సంపాదకులు కె.వి.ఎస్. నరసింహం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మన మాతృబాష దేశంలో  వున్న భాషలన్నింటిలోనూ అత్యంత మధురమైనది అని తెలిపారు. 

    సమాజహిత సంపాదకులు నరసింహం మాట్లాడుతూ ... గిడుగు రామమూర్తి పంతులుగారు బహుముఖ ప్రజ్నాశాలి అని, ఆయన  1910 నుండి మూడు దశాబ్దాల పాటు వ్యవహారిక భాషోద్యమాన్ని నిర్వహించిన మహనీయుడని కొనియాడారు. ఆయన రాసిన కొన్ని రచనలలో నేటి తెలుగు, బంధు ప్రశంస, గ్రామ్యపద ప్రయోగం వంటివి ప్రాచుర్యం చెందాయని తెలిపారు. అటువంటి వ్యక్తిని గుర్తుంచుకొని నేడు ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన  భాష్యం ఎన్ఏడి శాఖ మణికంఠ రెడ్డి, రమేష్ గార్లను అభినందించారు.  ఆదునిక తెలుగు సాహిత్యాలకు గొప్ప  ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ వ్యావహారిక భాషలో వ్రాసిన వివిధ వ్యాసాలను కాపాడుకోవల్సిన ఆవశ్యకత  భావితరాలపై ఉందని అన్నారు. నేడు దీనినే ప్రామాణికంగా తీసుకున్న అనేక పత్రికల  సంపాదకులు వ్యవహారిక తెలుగు భాషా పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులు గారి విశేషమైన కృషి సదా మననం చేసుకుంతున్నాయని తెలిపారు.  ఆధునిక యుగంలో పరభాష ఆవశ్యకత పెరుగుతున్నప్పటికీ భాష్యం పాఠశాల తెలుగు దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. మనం ఎన్ని భాషలు నేర్చుకున్న మన మాతృభాషని విడువకూడదని అవకాశం వున్నంతవరకు ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యులు తెలుగులోనే మాట్లాడాలని  చక్కని సందేశాన్నిచ్చారు. అనంతరం భాష్యం విశాఖ జోన్ 1 జోనల్ ఇన్చార్జ్  కె. వెంకట్ గారు మాట్లాడుతూ ఎందరో మహనీయులు గొప్ప గొప్ప కవులుగా తమ రచనలతో తెలుగు భాషాభ్యుదయానికి తోడ్పడ్డారని, అలాంటి వారందరిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా అంతటి  గొప్ప కవులుగా ఎదిగి, భాషావిలువలు కాపాడుతూ దేశ ప్రగతికి దోహదపడాలని విద్యార్థులకు సూచించారు.

    భాష్యం ఎన్ఏడి శాఖ  విద్యార్థులతో ఏర్పాటుచేసిన  సాంస్కృక కార్యక్రమాలు  ఆద్యంతం  అలరించారు. ఈ కార్యక్రంలో భాష్యం ప్రిన్సిపాల్ కె. మణికంఠ రెడ్డిగారు, వైస్ ప్రిన్సిపాల్  రమేష్ గారు, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">