మీడియా పవర్, అనకాపల్లి : కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ ఎదురుగా ఉన్న సంపత్ వినాయక దేవాలయం ప్రాంగణం దగ్గర జిల్లా ఓబీసీ మోర్చా ప్రదాన కార్యదర్శి బోండా యల్లాజీరావు ఆధ్వర్యంలో బుధవారం మన దేవాలయం మన హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ పిళ్ళై ముఖ్య అతిథిగా విచ్చేసారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడూతూ హిందూ దేవాలయాలలో కమిటీలు, పాలక మండళ్లలో అన్య మతస్థ్నులను అలాగే నేర చరిత్ర కలిగిన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం శోచనీయమన్నారు. ఇటువంటి నేపథ్యంలో హిందువులు అందరూ ఏకం కావాలని సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాణప్రతిష్ట జరపాలని కోరారు. దేవాలయాలపై అన్యమతస్తుల పెత్తనం లేకుండా పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెంటనే దీని పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తరువాత భక్తుల నుండి సంతకాల సేకరణ కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 86వార్డు అధ్యక్షులు తండాస వెంకటరావు, వడ్లపూడి మండల ఉపాధ్యక్షులు తిరుమల రాజు కృష్ణంరాజు, అగనంపూడి మండల అధ్యక్షులు కోసూరి తాతారావు, బొండా రాధా కృష్ణవేణి, గంధం లావణ్య భాస్కర్, గనివాడ సూర్యచంద్ర, వార్డు అధ్యక్షులు ఆది సత్తిబాబు, శిరీషతదితరులు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default