ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
పరవాడ, ఆగస్టు 29: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ఈ విషయంపై అవగాహనతో మెలగాలని డాక్టర్ శ్రావణి బెల్లం సూచించారు. సీఐఐ యంగ్ ఇండియన్స్ , గీతం డెంటల్ కళాశాల, ఆస్పత్రి సంయుక్తంగా పరవాడలోని బాలికల హైస్కూల్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈఎన్ టీ, చర్మవ్యాధులు, దంతం, జనరల్ విభాగాల్లో 500 మంది విద్యార్థినులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ నేడు ఆధునీకరణ పేరుతొ మనం ఉరుకుల పరుగులు తెస్తున్న కాలంలో జీవిస్తున్నామని అన్నారు. దీనితో అధిక శాతం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే మానసికంగా మనం దృఢంగా ఉంటామన్నారు. మనిషి మానసికం గా బలంగా ఉంటేనే విద్యతో పాటు మిగిలిన రంగాలలో కూడా రాణిస్తారని అన్నారు.