మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటనను నిరసిస్తూ... ఏపీటిబిఈఎఫ్ అద్వ్యర్యములో కొవొత్తుల ర్యాలీ ప్రదర్శన

MEDIA POWER
0

విశాఖపట్నం, మీడియా పవర్: మణిపూర్ లో మహిళలకు జరిగిన అన్యాయాన్ని  ఖండిస్తూ  ఏపీటిబిఈఎఫ్ ( ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం)  మహిళా కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ రోజు విశాఖపట్నం జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం  అద్వ్యర్యములో జివిఎంసి  గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన రాలీ నిర్వహించారు.  ఈ సందర్భము గా ఏపీటిబిఈఎఫ్ అసిస్టెంట్ కన్వీనర్ కామ్రేడ్ వైశాలి మాట్లాడుతూ మణిపూర్‌లో తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటన ఉద్రిక్తతలను రాజేసిందని, ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు పాశవికంగా ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు.  ఈ అనూహ్య  ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, మణిపూర్ లో శాంతి భద్రతలు నెలకొల్పాలని మణిపూర్ ప్రజలు కు సంఘీభవముగా ఈ రోజున ఈ కార్యక్రమము చేపట్టామని తెలిపారు.ఈ సందర్భము గా ఆమె పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే మహిళల పై దాడులు జరిగాయని  ఇటువంటి ఘటనలు  పునారావృతం కాకుండా చూడాలని కోరారు. 

    ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి కామ్రేడ్ ఆర్ వసంత రావు మాట్లాడుతూ దేశంలోని మహిళలపై జరిగిన ఈ సంఘటన అత్యంత ఏహ్యమైన చర్యగా భావిస్తున్నామని , మహిళలకు అండగా నిలపడతామని తెలిపారు. దేశ మహిళలపై జరిగిన ఈ ఘటనపై నిర్వహించిన ఈ కొవొత్తుల ర్యాలీ ప్రదర్శనకు తమవంతు మద్దత్తు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పడాల రమణ అన్నారు. ఈ కొవొత్తుల ర్యాలీ ప్రదర్శనలో  ప్రసాద్, కమలాకర్, శ్రీనివాస్, అడారి శ్రీను, శ్రీనివాస కుమార్ మరియు బ్యాంక్ మహిళా సంఘం ప్రతినిధులు కామ్రేడ్ స్వాతి,సుజాత, ప్రత్యూష , జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి.వి గణేష్ మరియు పెద్ద సంఖ్యలో వివిధ బ్యాంకు శాఖల  ఉద్యోగులు పాల్గొన్నారు.

 





Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">