జనవాణి లో ఫిర్యాదుల వెల్లువ
అధికార పార్టీ దాష్టికాలపై ఫిర్యాదులు
వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అత్యధిక శాతం
కాలుష్యం పరిణావరణం పై సమస్యలు చెప్పుకున్న .. స్టీల్ ప్లాంట్ బాధితులు, మత్స్యకారులు
ఏడున్నర గంటలపాటు నిలబడి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
340కి పైగా అర్జీల స్వీకరణ ... బాధితులకు భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: నేడు నగరంలోని ప్రముఖ హోటల్ లో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వెల్లువల వచ్చిన ఫిర్యాదులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఉత్తరాంధ్ర నుండి, ఉభయ గోదవారి జిల్లాలనుండి అనేక మంది వారి వారి సమస్యలను చెప్పుకునే అవకాశం రావడంతో జనసేనానికి తెలిపారు. జనసేనాని వాటిపై సానుకూలంగా స్పందించారు. ఉత్తరాంధ్ర విధ్వంసమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యపట్టారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షించవలసిన ప్రభుత్వం ఈ విధానం అవలంభించడం దారుణం అన్నారు . ప్రజల ఆస్తులకు మాన ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైనం అత్యంత దారుణం అన్నారు . కులాల మధ్య చిచ్చు పెడుతూ అత్యంత దారుణ మైన రాజకీయపోరాటం చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎటు చూసినా దోపీడీలు... దౌర్జన్యాలతో రావణ కాష్టాన్ని తలపిస్తున్న అధికార పార్టీ నాయకుల అరాచకాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులపై అయన స్పందిస్తూ రాష్ట్రంలో కనిపించని దోపిడీ.. ప్రతి కాగితం వెనకా కన్నీటి గాధలు.. ప్రతి ఆర్జీ వెనుకా బయటికి చెప్పుకోలేనిఆవేదనలు దాగిఉన్నాయని తెలిపారు. మా ప్రభుత్వం అద్భుతాలు చేస్తోందని జబ్బలు చరుచుకుంటూ చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం... అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల సొమ్మును తమ పార్టీ నేతలకు దోచిపెడుతున్న వైనాన్ని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధమైన ఆరాచకాలకు పాల్పడుతుందో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన 'జనవాణి జనసేన "భరోసా' కార్యక్రమంలో కళ్లకు కట్టినట్టు కనపడ్డాయని తెలిపారు. సునామీలా వెల్లువెత్తిన అర్జీలు పేరుకుపోయిన సమస్యల చిట్టాకు తార్కాణం కదా? అని ప్రశ్నించారు. గురువారం విశాఖ ప్రజల సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరించేందుకు జనసేన పార్టీ అధ్యకుల పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి "భరోసా" కార్యక్రమానికి అత్యధికంగా భూ బకాసురుల కాటుకు భూమి కోల్పోయిన సామాన్యులు, పించన్ ఎందుకు పోయిందో కూడా తెలియని దయనీయ స్థితిలో వున్నా వృద్దులు, దివ్యాంగులు ఇలా అనేకమంది ఇచ్చిన వినతులు వెల్లువలా వచ్చిపడ్డాయి. కాలుష్యపు కోరల్లో కొట్టు మిట్టాడుతున్న నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఎల్టీ పాలిమర్స్ భాధితుల నుంచి పవన్ కళ్యాణ్ చెంతకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యల అర్జీలు వస్తూనే ఉన్నాయి. ఏడున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో అయన ఎంతో ఓర్పుతో అర్జీలను అందుకొని వీటన్నింటిపై కేంద్రప్రభుత్వానికి తెలియచేస్తానని భరోసా కల్పించారు.