క్యాన్సర్ అరికట్టే అవకాశం వుంది .... ఆరోగ్యం పై అవగాహన అవసరం ... డా. వంశీధర్ పుట్రేవు.

MEDIA POWER
1 minute read
0


మీడియా పవర్ , హెల్త్ సిటీ, విశాఖపట్నం: వ్రిందా ఆడిటోరియంలో ప్రింట్ మీడియా పబ్లిషర్స్ ఎడిటర్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వింద్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కాన్సర్ రీసెర్చ్ సెంటర్ లో అందరికి ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్. వంశీధర్ పుట్రేవు వ్యవహరించారు. వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రపోషిస్తున్న పత్రికా ప్రచురణకర్తలను ప్రశంసించారు. వీరు కూడా ఆరోగ్యం పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విచక్షణ వివేకంతో వ్యవహరించే సంపాదకులపై అత్యంత ఒత్తిడి ఉంటుందని, ప్రజలకు, ప్రభుత్వానికి వారిదిగా ఉన్న మీరు, సమాజంలో జరుగుతున్న అనేక యదార్ధ వార్తలను ప్రచురిస్తూ మంచి, చెడులను తెలియజేస్తున్నవీరు వ్యక్తిగత ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ద చూపించవలసిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి మారుమూలలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ఆవశ్యకత సహకారం అవసరమని కోరారు. 40 సంవత్సరాల దాటిన పురుషులలో ప్రోస్టేట్ తనిఖీ అవసరమని. 40 సంవత్సరాల దాటిన స్త్రీలలో పాప్స్ స్మీర్మెమోగ్రఫీ, రక్త మొదలగు క్యాన్సర్ కారక పరీక్షలు చేయించుకుంటే, వ్యాధిని ఎక్కువగా సంభవించకుండా నిరోధించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 8. సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వయస్సు ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే 99% క్యాన్సర్ అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరిలోవ హెల్త్ సిటీ వ్రిందా ఆసుపత్రి ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు, ప్రింట్ మీడియా, పబ్లిషర్స్ ఎడిటర్స్ జర్నలిస్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్య భగవాన్ మరియు సభ్యులు, తేజ, జె.జోషి, వి. ఉదయ్ కుమార్, పీసా శ్రీనివాస్, వంగూరి గణేష్, సమాజ హిత ప్రచురణకర్త నరసింహం, వినోద్ కుమార్ తదితరులు హాజరైయ్యారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">