కొత్తవలస రైల్వే స్టేషన్ సందర్శించిన బిజెపి ఎంపి "జీవీఎల్"

MEDIA POWER
0



కంటకాపల్లి వద్ద ప్రమాదం అనంతరం  రైల్వే శాఖ తీసుకున్న  చర్యలపై  ఆరా! 

కొత్తవలస రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు పరిసీలించిన ఎంపి.

విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేసే విధంగా కార్యాచరణ .

స్థానిక ప్రజల నుండి  అనూహ్య స్పందన. 

విశాఖపట్నం: ఈరోజు బిజెపి ఎంపి , ఈస్ట్ కొస్ట్ రైల్వే జోనల్ సలహాదారుల సభ్యులు జీవీఎల్ నరసింహారావు కొత్తవలస రైల్వే స్టేషన్ ను సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇటీవల కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం అనంతరం రైల్వే అధికారులను అడిగి ప్రమాదానికి కారణాలు వాటి నివారణకై తీసుకున్న చర్యలపై రైల్వే బోర్డు చైర్మన్ ను కలిసి చర్చించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ తీసుకున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జీవీఎల్ కొత్తవలస స్టేషన్ ను సందర్శించారు. అక్కడి సిగ్నలింగ్ వ్యవస్థను, రైల్వే స్టేషన్ లోని ప్రయాణీకుల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన సౌకర్యాలను, పూర్తిస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధాని మోడీ గారు వెంటనే స్పందించి 24 గం. ల లోపు ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని అందచేసి తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ పథకం నిధులతో కొత్తవలస రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాటుఫారమ్ లను కలిపే విధంగా నడక బ్రిడ్జి నిర్మిస్తారని, అంతకు ముందు గల రాయగడ-గుంటూరు ప్యాసింజర్ తో పాటు మరికొన్ని ముఖ్యమైన రైళ్లు కొత్త వలసలో ఆగే విధంగా తాను ప్రయత్నిస్తానని తెలియచేశారు. ఈ నెల 22 వ తేదీ నుండి త్వరలో తన ప్రయత్నంతో సాధించబడి ప్రారంభమౌతున్న విశాఖ- కాశీ ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరాంధ్ర వాసులకు గొప్ప వరంగా నిలుస్తుందని జీవీఎల్ తెలిపారు. త్వరలో తాను విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేసే విధంగా అవసరమైన కార్యాచరణను రూపొందించుకున్నట్టు తెలిపారు. అందుకు స్థానిక ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని, అత్యంత అభిమానంతో ప్రోత్సహిస్తున్నారని జీవీఎల్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">