హోరెత్తిన భరత్ ఎన్ని"కల" ప్రచారం అడుగడుగున " జన " నీరాజనం....

MEDIA POWER
0

అనకాపల్లి మండలం "బవులువాడ " లో 

భరత్  విస్తృత ప్రచారం 

మీడియా పవర్, అనకాపల్లి:  అనకాపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కి ప్రజలు సంఘీభావం తెలియజేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బవులువాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి వెంకట అప్పారావు  నేతృత్వంలో  గురువారం ఎన్నికల ప్రచారం ఘనంగా  నిర్వహించారు. ముందుగా గ్రామ దేవత మరిడిమాంబ అమ్మవారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి  ప్రచారం లో పాల్గొన్నారు. రోజు రోజుకు భరత్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్న జనం స్వచ్చందంగా ఆయనతో కలసి నడిచేందుకు తరలివస్తున్నారు ప్రచార స్థలానికి చేరుకోగానే మహిళలు, స్థానిక నాయకులు భరత్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు.  ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందిస్తూ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమాలను వివరిస్తున్నారు.  ఈ ఎన్నికలలో  తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు.  గడప గడపలో మహిళలు భరత్ కు హరతులు ఇస్తున్నారు. మార్గ మధ్యలో అవ్వా తాతలను పలకరిస్తూ వారి యోగ క్షేమాలని అడిగి తెలుసుకుని తనను ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేయాలని , అనకాపల్లి ని అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికి అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా పరిష్కారిస్తానని తెలిపారు. మీకు సహకరిస్తామంటూ భరత్ కు భరోసా ఇచ్చారు గ్రామం లోని ప్రజలు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు, అవ్వ తాతలకు, చిన్నారులకు  చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేయలేదని  గుర్తుచేశారు. ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ముఖ్యమంత్రిని చేయవలసిన భార్యతను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి సుస్థిరమవుతుందని ఆయన చెప్పారు. మే 13 న జరగబోయే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి గా బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గా మలసాల భరత్ కుమార్ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందా, గ్రామ పార్టీ అధ్యక్షులు మజ్జి వెంకట అప్పారావు, దాడి కుమార్, బొద్దపు ప్రసాద్, ముమ్మిన శ్రీనివాసరావు,  ముత్యాలకన్నారావు, ఉప్పులూరి శ్రీనివాసరావు, అధికారి వెంకటరావు, కరణం నాయుడు, మడక వీరు బాబు, ముమ్మిన శ్రీను,సేనాపతి సూర్యారావు, నేమాల రమణాజీ, చొప్ప శ్రీను, తూరిబిల్లీ చంటి, తూరిబిల్లి శ్రీను ,గాడి చిలుకు, బొద్దపు శ్రీను, జమాదుల రామకృష్ణ, ఎండి ముస్తఫా, పితాని మారేసు, మనోహర్, వాయుబోయిన శ్రీను, కాకర అచ్చి బాబు, యలం అప్పలరాజు, బలిరెడ్డి సత్తిబాబు, వెన్నెల నాగేశ్వరరావు, టెక్కల శ్రీను, నక్క రమణ, రవి, ప్రకాష్ రావు, దాడి శ్రీరాములు, ఎండి గౌస్,మోటూరి భాను, కండుబోతు బుజ్జి, గొర్లి నాయుడు, గాలి సన్యాసిరావు మరియు గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">