మీడియా పవర్, చీడికాడ : గడిచిన 50 ఏళ్ల అనంతరం మాడుగుల నియోజకవర్గంలో మరలా మహిళా శాసన సభ్యురాలు సేవలందించే అవకాశం వచ్చిందని, ప్రజల దీవెనలతో 50 ఏళ్ళ చరిత్రను తిరగరాసే రోజు త్వరలోనే రానుందని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ తెలిపారు. వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తనను ఆశీర్వదించాలని వాలంటీర్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించి ఇంటింటికి ఎంతో మేలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తన తండ్రి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు వేసిన బాటలో తాను నడుస్తూ అందరికీ అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కరిస్తానని తెలిపారు. తండ్రి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అయన సేవలు గుర్తించి తనను ఆదరించాలని మాడుగుల కోటపై మరోసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసి విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మండలంలోని అర్జునగిరి,తురువోలు,చుక్కపల్లి,చెట్టుపల్లి, పెద గోవాడ గ్రామాల్లో నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అనురాధ పాల్గొన్నారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు రాజాబాబు, పలువురు నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత చరిత్రను తిరగరాసే రోజు దగ్గరలోనే వుంది ... మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ
April 12, 2024
0
Tags