సంక్షేమం కావాలంటే జగనన్న ప్రభుత్వమే రావాలి
తుమ్మపాలలో భరత్ కు బ్రహ్మరధం పట్టిన ప్రజలు
అనకాపల్లి ఏప్రిల్ 16: ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ మంగళవారం అనకాపల్లి మండలం తుమ్మపాలలో పిడి గాంధీ,చదరం శ్రీనివాసరావు, చదరం చిన్న, పీలా బుజ్జి నేతృత్వంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గంగాలమ్మ పుట్టని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల నుంచి ఆదరణ లభించడంతో పాటు పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని అందజేసి ఎన్నికల్లో తనకు ఓటు వేయమని అభ్యర్థించారు. గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపడుచులందరు భరత్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతా భారత్ అడుగులలో మేముసైతం అంటూ ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కలిగిస్తూ విద్యావంతుడైన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వైసీపీ తోనే సాధ్యం అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు. మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు...
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ ల్యాండ్ వాటర్ వెస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు,అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు పెద్ధిశెట్టి గోవిందా, వైస్ ఎంపీపీ వీల్లూరి సూర్య కుమారి శేఖర్, గ్రామ సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, పి, గాంధీ, సి హెచ్ చిన్న, పీలా బుజ్జి, సూరిశెట్టి శ్రీను,కొణతాల శివాజీ , ఎంపీటీసీలుఅశోక్, పన్నీరు చంటి, పంచదారల కన్నారావు,పడాల గణపతి, బుదిరెడ్డి దేవుడు,కోలపర్తి శ్రీను, ఆడారి ప్రసాద్, ఆడారి లక్ష్మణరావు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పాల్గొన్నారు