మీడియా పవర్, అనకాపల్లి : శ్రీరామనవమి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే మలసాల భరత్ కుమార్ దంపతులు జీవీఎంసీ, అనకాపల్లి మండలంలోని సీతారాముల దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వేల్పుల వీధి,మళ్ల వీధి, పెద్దవీధి, కోట్నివీధి, చిన్న వీధి, చేపల బజార్,నర్సింగరావుపేట, పూడిమడక రోడ్డు రామాలయం వీధి, ప్రకాష్ రావు పేట, చిన్న బోయగూడెం, అంబేద్కర్ నగర్, పెదబోయిగూడెం, అగ్గి మర్రి చెట్టు బేతాళ స్వామి గుడి, అరుంధతి నగర్, తుమ్మపాల, మాటూరు గ్రామాలలో వివిధ శ్రీ సీతారాముల ఆలయాలను సందర్శించారు. వివిధ దేవాలయాలలో ఆయనకు ప్రత్యేక పూజలు చేసి సీతారాముల జ్ఞాపికలను అందచేశారు.
Post a Comment
0Comments
3/related/default