మీడియా పవర్, విశాఖపట్నం : పశ్చిమ వైసీపీ అభ్యర్థి "ఆడారి ఆనంద్ " విజయం ప్రజా మద్దతుతో సాధ్యం అని ఆడారి సతీమణి మాలతి అన్నారు . 90వ వార్డు కాకానినగర్ ప్రాంతంలో వార్డ్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ఇంచార్జ్ చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పేడాడ రమణి కుమారి తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను అందించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరారు. కేవలం నామినేటెడ్ పదవితోనే ఇంత అభివృద్ధి చేసిన ఆడారి, ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గంలోని వార్డుల్లో 263 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాగా, సొంత నిధులు ఖర్చు చేసి, విద్య, వైద్యానికి ధన సహాయం చేసారని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ తో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు మొత్తం ప్రచారం నిర్వహించిన మాలతి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default