జగన్ని మళ్ళీ సీఎం చేద్దాం .... సంక్షేమాలు అందుకుందాం ... కె కె రాజు

MEDIA POWER
0



26 వ వార్డు ఎన్నికల ప్రచారంలో 

అడుగడుగునా ఆత్మీయ స్వాగతం  

జగన్మోహన్‌ రెడ్డి తోనే ప్రజలందరికీ మేలు 

మీడియా పవర్‌, విశాఖపట్నం వుత్తరం : ఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు  26వ వార్డులో చిన్నవూరు మషీద్‌, బోరావారి వీధి, రామకృష్ణ నగర్‌, లలిత నగర్‌, చాకలి పేట, 80 అడుగుల రోడ్డు, ప్రాంతంలో నేటి రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆయన చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు.ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వికెపిసిపిఐఆర్‌  చైర్మన్‌ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కకుల వెంకట్రావు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు వుడా రవి, జి. వి.రవిరాజు, జేసీఎస్‌  కన్వినర్‌ బులుసు జగదీష్‌, 26 వార్డ్‌ సీనియర్‌ నాయకులు బొడ్డేటి కిరణ్‌,పాండవ శ్రీను, శేషు,అమ్మాజీ, హరి, నవాబ్‌, శ్యామ్‌, దేముడు, రాము, మరియు పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">