
ఎండని సైతం లెక్కచేయని అభిమానులు
జన జాతర మధ్య భారత్ నామినేషన్
అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేశారు. ముందుగా అయన సర్వమత ప్రార్ధనలు,ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి అతడికే సంఖ్యలో అభిమానులు ప్రజలు, వైయస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు రింగురోడ్డులోని ఆఫీసుకార్యాలయానికి చేరుకున్నారు. భారీ జనసందోహంనడుమ అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలి గవరపాలెం , బెల్లం మార్కెట్ పాతబస్ స్టాండ్ నాలుగు రోడ్డుల్లా జంక్షన్, గాంధీనగరం, గుండాల వీధి, మీదుగా ఆర్ ఓ ర్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేసారు.. అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ రోడ్లకు ఇరువైపులా నుంచున్న ప్రజలకు అభివాదం చేస్తూవుంటే జై భారత్ జై జగన్ అను నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు, వైయస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ, 2024 ఎన్నికల యుద్దానికి సిద్ధమైనామని ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి పార్లమెంటు మరియు శాసన సభకు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులను పంపించాలని కోరారు. భగ భగ మండుతున్న భానుడిని సహితం లెక్కచేయకుండా ఉప్పెనలా ఉప్పొంగిన ఉత్సాహం తో కార్యకర్తల సైన్యం.. అనకాపల్లి అభ్యర్థి మలసాలకు ఎదురులేదు-... అనకాపల్లిలో వైసీపీకి తిరుగులేదంటూ చాటారు. ప్రజలు,వైయస్ఆర్సీపీశ్రేణులు..భారీ జనసందోహంతో రాష్ట్ర చరిత్రలో ఎక్కడ చూడని రీతిలో సాగిన భరత్ కుమార్ నామినేషన్ ఘట్టం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించవలసిన అధ్యాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి అభ్యర్థి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎం పి సత్యవతి , ఎస్సార్సీపీ నాయకులూ దంతులూరి దిలీప్ కుమార్, జయరాం తదితరులు పాల్గొన్నారు.