- వెలగపూడి - భరత్ లను గెలిపించండి
- ఓటు వేసి ఉమ్మడి కూటమిని గెలిపించండి
- మన అభివృద్ధిని మనమే చేసుకుందాం
మీడియా పవర్, విశాఖపట్నం : సీఎం దుష్టపాలనకు చరమగీతం పాడాలని ఎంపి అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి తేజస్విని పిలుపునిచ్చారు. అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి కూటమి తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంపి అభ్యర్థి ఎం శ్రీ భరత్ లను గెలిపించాలని హీరో బాలకృష్ణ కుమార్తె, ఎంపి అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి తేజస్విని కోరారు. ఆరిలోవ ప్రాంతం లోని 11వ వార్డు దుర్గమ్మ గుడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభించిన తేజస్విని తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు తో కలసి ప్రచారకార్యకంలో పాల్గొన్నారు. వార్డు పరిసర ప్రాంతంలో సుమారు 14 వీధుల్లో పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆపదలో అక్కున చేర్చుకునే అత్యుత్తముడు వెలగపూడి అని విద్య, వైద్యం, ఉపాధి ప్రతి ఇంటికి అందాలని ఆరాటపడే సహృదయుడు శ్రీ భరత్ అని తెలియచేసారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులైన వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంపి అభ్యర్థి ఎం శ్రీ భరత్ లనుగెలిపించి దుష్ట పాలనను అంతమొందించాలని కోరారు. మీ ఓటు ఎంతపవిత్రమైనది అన్న సంగతి ఇప్పటికే అనేకమందికి అర్థమైనదని ఒక్కఅవకాశం అడిగారని జాలిపడితే దానిపర్యవసానం ఇప్పటికే రాష్ట్రప్రజలకు అర్థమైందని అవగాహనా కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని టిడిపిని గెలిపించు కొందామని పిలుపు నిచ్చారు. పర్యటనలో టీడీపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఓమ్మి సన్యాసిరావు, వార్డు ఇంచార్జీ రాగతి అచ్చుతరావు వార్డు అధ్యక్షుడు ముగడ రాజారావు, వార్డు ప్రధాన కార్యదర్శి పేపర్ నాయుడు, సీనియర్ నాయకులు ఎం. అప్పారావు, కృష్ణం రాజు, ఇతర నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.