పశ్చిమలో రెపరెప లాడుతున్న వైకాపా జెండా .. ఆనంద్ దే గెలుపు అంటున్న సర్వేలు

MEDIA POWER
0


  

  • ఫ్యాన్ గాలికి కూటమి చిన్నా బిన్నం  
  • విశాఖ పశ్చిమంలో  వైసిపి దే ఆధిపత్యం 
  • రాజకీయ చాణుక్యుడిగా ఎదిగిన  'ఆడారి ఆనంద్' 
  • నగరంలో కీలకం... పశ్చిమ రాజకీయం
  • కూటమి అభ్యర్థి నైరాశ్యం.. ఆశలకు గండి 

    మీడియా పవర్, విశాఖపట్నం:  విశాఖ మహా నగరంలోని పశ్చిమ నియోజక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడడంతో కూటమి అభ్యర్థి... నైరాశ్యానికి లోనైనట్టు తెలుస్తోంది. వైకాపా అభ్యర్థి అపరచాణుక్యుడిలా మారడంతో పశ్చిమంలో ఆనంద్ గెలుపు సుగమమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విదితమే.  ఉత్తరాంధ్రలో పాలఉత్పత్తులతో సంచలనాలు సృష్టించిన స్వర్గీయ ఆడారి తులసీరావు వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆనంద్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నియోజకవర్గంలో తనగులుపుకు బలమైన పునాదులను ఇప్పటికే వేశారు. రాజకీయ పండితులకు అర్ధంకాని రీతిలో ఆయన  వ్యూహాలను అమలుచేస్తూ  రాజకీయ ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.  ఫలితంగా విశాఖ పశ్చిమంలో ఈసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని విశ్లేషకుల వాదన.

    2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఇక్కడనుండి తెలుగుదేశం పార్టీ తరపున గణబాబు ఎన్నికయ్యారు. గడచిన  ఎన్నికల్లో ఆయన గెలుపొందినా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. అంతేకాదు ఊగిసలాట ధోరణి కారణంగా ఆయన కార్యకర్తలు అనేకమంది ఆడారి ఆనంద్ సమక్షంలో  వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీనితో  వైసీపీ అభ్యర్థి ఆనంద్ కు అత్యధిక బలం సమకూరడంతో ప్రత్యర్థి  పోటీ ఇవ్వలేక పోతున్నారని తెలుస్తోంది. నాయకుడంటే ఇలా వుండాలి అనుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనంద్ ప్రదర్శిస్తున్న తీరు ఆయనను మరింత చేరువ చేస్తోందన్న వడలు వినిపిస్తున్నాయి. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిగా వుంటాను అన్న మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతున్న ఆయనకు  ప్రజల చూపుతున్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. దీనితో  విశాఖలో వైఎస్ఆర్ సీపీ గెలిచే తొలి సీటు ఇదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నగర పరిధిలో ఇటీవల జరిగిన సీఎం జగన్ బస్సు యాత్ర ఘనంగా నిర్వహించడంలో ఆనంద్ నూటికి నూరు మార్కులు సాధించారు. నియోజక వర్గంలో   ఆనంద్ సాగిస్తున్న ప్రచారంతో  విశేష ఆదరణ నోచుకుంటోంది. గడచిన ఎన్నికల్లో నగరంలో నాలుగు నియోజక వర్గాల్లో  టిడిపి గెలుపొందిన విషయం మీడియా పవర్ ఫాఠకులకు విదితమే అయితే ఈ  ఎన్నికల్లో నగరంలోని పశ్చిమ నియోజక వర్గం నుండి విజయ పరంపర ప్రారంభిస్తుందని   వైసీపీ శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలు నిర్వహిస్తున్న సర్వేలలోను ఏది విషయం బయట పడుతుందంటూ ఆనంద్ గెలుపు ఖాయమని పార్టీశ్రేణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">