మీడియా పవర్, విశాఖపట్నం: ఏ ప్రాంతం అభివృద్ది చెందాలన్నా అక్కడ శాంతిభద్రతలు అదుపులో ఉండాలని విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్ది శ్రీ భరత్ తెలిపారు. నగరంలోని మార్వాడి సమాజ్ ప్రతినిదుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గోన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎన్ఎడిలో మార్వాడి సమాజ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వ్యాపార రంగం పరిస్థితులపై చర్చించారు. విశాఖలో పారిశ్రామిక వ్యాపార వృద్దికి మార్వాడీ సమాజం ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తోలి ప్రాదాన్యంలో శాంతి భద్రలను అదుపులోకి తీసుకువచ్చి పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తామని హామి ఇచ్చారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుతో రాష్ట్ర పారిశ్రామిక వ్యాపార వాణిజ్య రంగాలు తిరోగమనంలో ఉన్నాయని వివరించారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి దారుల్లో రాష్ట్రం నమ్మకం కోల్పోవలసి వచ్చిందన్నారు.. దినిని అధికమించే విదంగా నరేంద్రమోది నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మార్వాడి సమాజ్ రాష్ట్ర పరిస్తితులను అర్ధం చేసుకుని ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పించే విదంగా ఇక్కడ ప్రతినిదులు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడి పెట్టుబడులు పెట్టే విదంగా కృషి చేయాలని కోరారు.. తెలుగువారు ముఖ్యంగా ఉత్తరాంద్రా విశాఖ ప్రజలు అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకుంటారని తెలిపారు.. గడిచిన దశాభ్దాలుగా మార్వాడి సమాజం విశాఖ ప్రజలతో కలిసిమెలిసి ఉంటుందన్నారు. దినితో ఇక్కడ స్థిర పడిన మార్వాడి కుటుంబాల వారందరు తెలుగువారిగా గుర్తింపు పోందారన్నారు.. ఇక్కడి మార్వాడి కుటుంబాల పిల్లలు ఇక్కడే వ్యాపారాలు నిర్వహించి మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో పశ్యిమ నియెజకవర్గం కూటమి అభ్యర్ది పి గణబాబు కుమారుడు, పి మౌర్యతో పాటు బిజేపి జిల్లా అద్యక్షులు రవిందర్ రెడ్డి మార్వాడి సమాజ్ ప్రతినిదులు పాల్గోన్నారు.
Post a Comment
0Comments
3/related/default