విశాఖపట్నం, ఏప్రిల్ 28: పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే గా అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చింది పదవి కోసం కాదని సేవ చేయడానికని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి తెలిపారు. జీవీఎంసీ 62 వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, వార్డ్ అధ్యక్షులు భీశెట్టి గణేష్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో రమాకుమారి పాల్గొన్నారు. ఆమెకు అడుగడుగునా స్థానిక ప్రజలు నీరాజనం పలికారు. పూలదండలతో హారతులతో స్వాగతం పలిగిన మహిళలకు రమా కుమారి అభివాదం చేస్తూ ప్రజలతో మమేకమైనారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు. ఒక సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆనంద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిస్తే ఏడాది కాలంలో పదేళ్లుగా అమలుకు నోచుకోని పనులను తక్షణమే పరిష్కరిస్తారని ఇది ఆయన మాటేనని ఆమె చెప్పారు. 62వ వార్డు ప్రజలు పదవికోసంకాకుండా ప్రజా సేవకోసం ఆరాటపడుతున్న ఆమె అన్నయ్య ఆనంద్ కు అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default