రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు.
గోనెగండ్ల : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల
నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు
నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. సార్వత్రిక
ఎన్నికల నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఇప్పుడు
మైనారిటీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు. గతంలో సాక్షిగా ఎన్‌ఆర్సీ, సీసీఏలకు
మద్దతు ఇచ్చిన వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కాదా అని
ప్రశ్నించారు. మైనారిటీలకు వచ్చే పథకాలపై ఆంక్షలు విధించి ఓట్ల కోసం
తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనలో మైనారిటీలపై
దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. తెదేపా పాలనలో ఆడ బిడ్డలకు రూ.50వేలు,
రంజాన్ తోఫా, దుకాణ్‌మకాన్, హజ్‌యాత్రకు సబ్సిడీ, మోజాన్ ఇమామ్‌లకు గౌరవ
వేతనం, మసీదులకు రంగులు వేయడం, కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని
ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కూల్చడం, తాకట్టు పెట్టడం, ప్రాంతాలు,
కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై వైకాపా
ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు
మైనారిటీలు సరైన రీతిలో బుద్ది చెబుతాయి.