అన్న భారత్ గెలుపుకు పునాదులు వేస్తున్న తమ్ముడు
అనకాపల్లి : జీవీఎంసీ పరిధిలోని 80 వార్డ్,19,21వ సచివాలయం ల పరిధిలో కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొణతాల మురళీకృష్ణల సారథ్యంలో వైస్సార్సీపీ నాయకులు వేగి త్రినాధ్, దాడి శివ, కొణతాల సన్యాసినాయుడు ల పర్యవేక్షణలో మలసాల భరత్ సోదరుడు మలసాల కుమార్ రాజా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెంకన్న కొట్టు జంక్షన్, కర్రి పెద్దయ్య గారి వీధి, కర్రి పైడయ్య గారి వీధి, కొణతాల వారి దొడ్డి, బుద్ధ రామదాసు గారి వీధిలో సాగిన పర్యటనలో కార్పొరేటర్ కొణతాల నీలిమ మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి ఇంటికి మంచి జరిగిందని , సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని గుర్తుచేశారు. మీరంతా మీకు ఉన్న రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై ఓట్లు వేసి ఎంపీ గా బూడి ముత్యాలనాయుడున్నీ ఎమ్మెల్యే గా మలసాల భరత్ ని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కర్రి మోదీనాయుడు,ఆళ్ళ నాగేశ్వర్రావు, కాండ్రేగుల రాము, పెంటకోట శ్రీను, కొణతాల కృష్ణంరాజు, మారిశెట్టి శ్రీను,బుద్ధ నర్సింగరాజు,పెంటకోట దామోదర్, సూరిశెట్టి సత్తిబాబు,కాండ్రేగుల దేవా,అనురాధ,తొండ నారాయణమూర్తి, తొండ గీతాంజలి,పొలమరశెట్టి రమణ, వాసుపల్లి తాతయ్యలు, ఆడారి బాల, జిగట గణేష్, మర్రా జాన్ బాబు, నాయకులు,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.