అభివృద్ది చేసే ప్రభుత్వం కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి ...సిని నటుడు హైపర్ ఆది

MEDIA POWER
0

మీడియా పవర్, విశాఖ దక్షిణం: అభివృద్ది చేసే ప్రభుత్వం కావాలంటే తెలుగుదేశం, జనసేన, బిజేపి కూటమికి ఓటు వేయాలని అవినీతి ప్రభుత్వం కావాలంటే వైసిపి ప్రభుత్వానికి ఓటు వేయాలని సిని నటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. విశాఖ దక్షిణ నియెజకవర్గంలో కూటమి పార్లమెంట్ అభ్యర్ది శ్రీ భరత్, వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. అంబికా బాగ్, జాలరిపేట, రెల్లివీదిలో కూటమి తరుపున ప్రచారం నిర్వహించిన నేతలు కూటిమి ప్రభుత్వం వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ప్రజలను ఉత్సాహాపరుస్తూ ప్రసంగించిన నేతలు వైసిపి ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.. రాష్ట్రంలో అరాచకపాలన ముగింపు పలికేలా విశాఖ ప్రజల తీర్పు ఉండాలని కోరారు. సంక్షేమం అంటూ బటన్ నోక్కుతున్న జగన్ ప్రభుత్వం సాయంత్రానికి  జనం పీక నోక్కుతుందని దుయ్యపట్టారు. నాసిరకం  మద్యంతో ప్రజల ఆరోగ్యాలను, జేబులను గుల్ల చేస్తోందని అన్నారు. ప్రత్యక్షంగా పది రూపాయలు ప్రజలకు పంచుతూ పరోక్షంగా వందరూపాయల భారం ప్రజలపై వేస్తుందని విమర్శించారు. దక్షిణ నియెజకవర్గంలో సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. విశాఖలో సమస్యలకు శాస్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని బరోసా కల్పించారు.   


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">