— ప్రత్యర్థులకు దడపుట్టించే విధంగా అమర్నాథ్ నామినేషన్ ఘట్టం
— జనసంద్రంగా గాజువాక రహదారులు
— నామినేషన్ ఘట్టం పూర్తికావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్
మీడియా పవర్, గాజువాక: ఎటు చూసినా జనసంద్రం,,, కదం తొక్కిన కార్యకర్తలు.. జై జగన్ జై అమర్ అంటూ నృత్య, వాయిద్యాలతో దద్దరిల్లిన గాజువాక. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుధవారం అమర్నాథ్ నామినేషన్ దాఖలు వేశారు. ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ వేసే కార్యక్రమం అత్యంత హగ్ ఆర్భాటంతో సాగింది. ఆడ, మగ చిన్న, పెద్ద తేడా లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని, ఫ్యాన్ గుర్తును చూపుతూ కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ పార్టీ కేడర్ అంతా అమర్నాథ్ ప్రయాణిస్తున్న వాహనం వెనుక ఊరేగింపుగా సాగారు. ఎన్నిక వైసిపికి వన్ సైడ్ అవుతుందా అన్న రీతిలో గాజువాక నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది అడుగుపెట్టిన రెండు నెలల్లోనే క్యాడర్ను అంతా తన వైపు తిప్పుకొని అమర్నాథ్ విజయమీ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. బుధవారం జరిగిన ఈ నామినేషన్ వేసిన తీరు చూసి ప్రత్యర్థులకు కునుకు ఉండదంటూ గుసగుసలు మొదలైయ్యాయి. నామినేషన్ పర్వాన్ని చూసిన గాజువాక ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేశారని అమర్నాథ్ గెలుపు ఖాయమంటూ చర్చలకు తెరలేపారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బుధవారం ఉదయం మంత్రి అమర్నాథ్ సింహాచలం వెళ్లి వరాహ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పెద్దల వద్ద ఆశీర్వాదాలు తీసుకుని అనంతరం మింది ఆయన నివాసం నుండి భారీ ర్యాలీతో బయలుదేరి జింక్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొత్తగాజువాక, సినిమా హాల్ కూడలి, పాత గాజువాక, చినగంట్యాడ ప్రాంతాల మీదుగా భారీ ర్యాలీతో ముందుకు కదిలారు. మార్గమధ్యలో అమర్నాథ్ అభిమానులు గజమాలలతో వై.వి.సుబ్బారెడ్డిని సత్కరించారు. సుమారు మూడున్నర గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం గాజువాక లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని అమర్నాథ్ రెండు సెట్ల నామినేషన్ ఆయన సతీమణి హిమ గౌరి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి, ఆయన సతీమణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊరుకూటి అప్పారావు ఉన్నారు.
నామినేషన్ ప్రక్రియ పూర్తి ఆయన తరువాత అమర్నాథ్ మాట్లాడుతూ తన నామినేషన్ కు తరలి వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన నామినేషన్ ప్రక్రియను ఏవిధంగా విజయవంతం చేశారో అదే విధంగా వచ్చే నెల 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర కో ఆర్డనేటర్, రాజ్యసభ సభ్యులు వై వీ సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివేకంట కుమారి, మాజీ మేయర్ పులుసు జనార్దన్, మంత్రి రాజశేఖర్, తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, ఇమ్రాన్, భూపతి రాజు సుజాత, మహాలక్ష్మి నాయుడు, యువశ్రీ, తిప్పల స్వాతి రెడ్డి, సంతోషి తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.